కోనరావుపేట మండలంలో ముగిసిన కేసీఎల్ క్రికెట్ టోర్నీ 

కోనరావుపేట మండలంలో ముగిసిన కేసీఎల్ క్రికెట్ టోర్నీ 

కోనరావుపేట, వెలుగు; క్రీడలు మానసికోల్లాసాన్ని కల్గిస్తాయని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేములవాడ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. మంగళవారం కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో బావుసాయిపేట మాజీ సర్పంచ్ కేంద గంగాధర్, కేసీఎల్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు.

మంగళవారం టోర్నీ విజేతలకు చల్మెడ బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆటలో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో సెస్ వైస్ చైర్మన్ తిరుపతి, సింగిల్ విండో వైస్ చైర్మన్లు భూమిరెడ్డి, మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మండల అధ్యక్షుడు దేవయ్య, లీడర్లు పాల్గొన్నారు.