
భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్ లోని రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, మంత్రులు దూరంగా ఉన్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఒక్కరు కూడా హాజరుకాలేదు. ఉదయం రాజ్భవన్లో జరిగిన గణతంత్ర వేడుకలకు సైతం సీఎం కేసీఆర్ దూరంగానే ఉన్నారు. ఎట్ హోమ్ కార్యక్రమంలో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, బాబు మోహన్. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్, డీజీపీ అంజనీకుమార్, సీఎస్, శాంతాకుమారి పాల్గొన్నారు.