మొహాల్లా క్లినిక్లు చూసి కేసీఆర్ బస్తీ దవాఖాన పెట్టిండు : కేజ్రీవాల్

మొహాల్లా క్లినిక్లు చూసి కేసీఆర్ బస్తీ దవాఖాన పెట్టిండు : కేజ్రీవాల్

కంటి వెలుగు కార్యక్రమం గొప్ప సంకల్పమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. 4కోట్ల మందికి ఫ్రీ ఐ చెకప్ చేయించడం మామూలు విషయం కాదని చెప్పారు. పంజాబ్ లోనూ కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల కాన్సెప్ట్ అద్భుతంగా ఉందని కేజ్రీవాల్ ప్రశంసించారు. ఢిల్లీలో ఆప్ సర్కారు ఏర్పాటు చేసిన మొహల్లా క్లినిక్ లను చూసే కేసీఆర్ బస్తీ దవాఖానాలు పెట్టారని అన్నారు.

ఢిల్లీ స్కూళ్లు చూసిన తర్వాతే స్టాలిన్ తమిళనాడు బడులలో మార్పులు చేశారని కేజ్రీవాల్ అన్నారు. విద్యా, వైద్యం బాగుంటే అభివృద్ధి సాధ్యమవుతుందని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. కేంద్రం చెప్పినట్లే గవర్నర్లు నడుచుకుంటున్నారని ఆరోపించారు. గవర్నర్లతో మోడీ విపక్ష సీఎంలను ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రపంచంలో అన్ని దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి కానీ మనం వెనకబడి పోయామని కేజ్రీవాల్ అన్నారు. కొట్లాడం కాదు నేర్చుకుంటే దేశం ఎక్కడికో పోతుందన్నారు. ఒకర్నుంచి మరొకరు నేర్చుకుంటే అభివృద్ధికి మార్గం ఏర్పడుతుందని చెప్పారు.