రైతుబంధు పేరుతో రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నారు : బండి సంజయ్

రైతుబంధు పేరుతో రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నారు : బండి సంజయ్

రాష్ట్రంలోని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేవు కానీ బెల్ట్ షాపులు మాత్రం కచ్చితంగా ఉంటాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. నిర్మల్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్.. దిలావర్పూర్ లోని శ్రీ ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలోని బెల్ట్ షాపులన్నీ సీఎం కేసీఆర్ దుకాణాలేనని ఆరోపించారు. వేరే దేశాల్లో పెట్టుబడులు పెట్టి లిక్కర్, డ్రగ్స్, క్యాసినో దందాలు నిర్వహిస్తున్న ఘనత కేసీఆర్ కూతురిదేనని ఆరోపించారు. 

రైతుబంధు పేరుతో రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ధరణి పోర్టల్ లోపాల పుట్ట అని, ధరణితో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పారు. నిరుపేదల భూములను కాజేసేందుకే ధరణిని తీసుకువచ్చారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నీ మరింత మెరుగ్గా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.