కేసీఆర్‌కు అనుభవం లేదు.. ముందుచూపు లేదు

కేసీఆర్‌కు అనుభవం లేదు.. ముందుచూపు లేదు

పోలీసులు కల్వకుంట్ల సైన్యం కావొద్దు

ప్రజలకు ఒక చట్టం.. కల్వకుంట్ల వారికి ఒక చట్టం ఉంటుందా..

కేసీఆర్ మెదక్ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

సీఎం కేసీఆర్‌కు అనుభవం మరియు ముందుచూపు లేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ పోరుబాట చేస్తుంది. ఆయా ప్రాజెక్టులను పరిశీలించాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు. ప్రాజెక్టుల పరీశీలనకు వెళ్లాలనుకున్న నాయకులను ప్రభుత్వం హౌస్ అరెస్టులు చేస్తోంది. హౌస్ అరెస్టు కావడంతో ఆయన తన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్ట్‌లో మే 2018 నుంచి ఇప్పటివరకు ఒక్క రూపాయి పని కూడా ఎందుకు చేపట్టలేదని ఆయన ప్రశ్నించారు. మేడిగడ్డ మరియు సీతారామా ప్రాజెక్టులలో అక్రమాలకు పాల్పడ్డారని ఆయన అన్నారు. ఆ ప్రాజెక్టులపై చూపించే ప్రేమ మరి ఎస్ఎల్‌బీసీ మీద ఎందుకు చూపించరని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన ఆరేళ్ల తర్వాత కూడా ఎస్ఎల్‌బీసీ ఎందుకు పూర్తి కాలేదని ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్టులన్నీ కమీషన్ల కోసమే నిర్మిస్తున్నారని ఆయన అన్నారు. గ్రావిటీ ద్వారా వచ్చే నీటిని ఎందుకు వాడుకోవడంలేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజావసరాలు తీరే వరకు పోరాటం చేస్తుందని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్.. మెదక్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు.  సింగూరు ప్రాజెక్ట్, మంజీర డ్యాంల నుంచి ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. నీళ్లు తరలించడం వల్లే సంగారెడ్డి జిల్లా ప్రజలకు తాగునీటి కష్టాలు వచ్చాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ అన్నారు.

పోలీసులు కల్వకుంట్ల సైన్యం కావొద్దు

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆహ్వానం మేరకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ నేతలు, ప్రజా ప్రతినిధులు గురువారం సంగారెడ్డి జిల్లాలోని మంజీరా డ్యామ్ పరిశీలనకు వెళ్లాలని అనుకున్నారు. అయితే వారిని పోలీసులు బయటకు రాకుండా.. ఆయన ఇంటి వద్ద భారీగా మోహరించారు. పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా మారోద్దని ఆయన అన్నారు. ‘కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ పదివేల మందితో ప్రారంభించారు. మంత్రులు జిల్లాల్లో నూతన వ్యవసాయ సాగు విధానం గురించి అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. మరి వారికి లేని రూల్స్.. మాకే వర్తిస్తాయా’ అని ఆయన ప్రశ్నించారు. పోలీసులు కల్వకుంట్ల సైన్యం కావొద్దని ఆయన అన్నారు. ప్రజలకు ఒక చట్టం.. కల్వకుంట్ల వారికి ఒక చట్టం ఉంటుందా అని ఆయన పోలీసులను ప్రశ్నించారు.

For More News..

గాంధీలో డాక్టర్లు పట్టించుకోవడం లేదు

ఏసీ పైపులో 40 పాము పిల్లలు

మాజీ కలెక్టర్‌పై రేప్ కేసు

పేకాటలో డబ్బు పోగొట్టుకొని బ్యాంకుకే కన్నం వేసిన క్యాషియర్‌

సింగరేణి బాధితులకు రూ. 40 లక్షలు.. ఒక జాబ్