
కేసీఆర్ ఫ్యామిలీ అవినీతి 10 లక్షల కోట్లు.. 10 వేల ఎకరాలు.. కేసీఆర్ అవినీతి వెలికి తీయాల్సిన బాద్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని.. బీజేపీలో చేరాను.. కవిత అరెస్ట్ కాకపోవటం..పదేళ్లుగా జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోకపోవటం వల్ల.. బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటే అని తేలిపోయింది.. ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు.. ప్రజలకు కూడా తెలిసిపోయింది అందుకే తిరిగి కాంగ్రెస్ లో చేరానని కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు.
కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు దోచుకుంది.. హైదరాబాద్ చుట్టూ 10 వేల ఎకరాలను బినామీలతో దోచుకుంది.. లక్షల కోట్లు.. ప్రాజెక్టులు.. మైనింగ్, గ్రానైట్ మాఫియా, ఇసుక మాఫియాతో లక్షల కోట్లు దోచుకున్నారని రాజ్ గోపాల్ రెడ్డి ఆరోపించారు. పదేళ్లుగా జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోకపోవటం వల్ల.. బీజేపీ, బీఆర్ ఎస్ ఒక్కటే అని తేలిపోయిందని.. ప్రజలు కూడా తెలిసిపోయిందని రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు.