ప్రజల సొమ్ము ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టుతుండు

ప్రజల సొమ్ము ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టుతుండు

తాడిచర్ల ఓపెన్ కాస్ట్ మైన్లో రూ.20 కోట్ల కుంభకోణం జరిగిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఆ మైన్ను సింగరేణికి కాకుండా ఏఎమ్మార్కు ఎందుకు కేటాయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. తాడిచెర్ల బొగ్గుకు ప్రభుత్వం రూ.3200 ఎందుకు చెల్లిస్తుందో చెప్పాలని అన్నారు. ఏఎమ్మార్ కు అధిక ధర చెల్లించి కేసీఆర్ ప్రజల సొమ్మును ప్రైవేటు కంపెనీకి కట్టబెడుతున్నారని వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. 

తాడిచర్ల మైన్ కుంభకోణంలో కేసీఆర్ కుటుంబానికి వాటా ఉందని వివేక్ ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిజాయితీ నిరూపించుకోవాలనుకుంటే తాడిచర్ల మైన్ విషయంలో సీబీఐతో విచారణ జరిపించాలని అన్నారు. తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ నిర్వాసితులకు, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం..

ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రానికి వర్ష సూచన

టెట్ వాయిదా వేసే ప్రసక్తే లేదు