టెట్ వాయిదా వేసే ప్రసక్తే లేదు

టెట్ వాయిదా వేసే ప్రసక్తే లేదు

టెట్ పరీక్ష వాయిదాపై వస్తున్న వార్తలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఎగ్జామ్ను పోస్ట్ పోన్ చేసే ప్రసక్తేలేదని స్పష్టంచేశారు. జూన్ 12న ఆర్ఆర్బీ పరీక్ష ఉన్నప్పటికీ టెట్ ఎగ్జామ్ యధావిధిగా జరుగుతుందని సబిత ప్రకటించారు. ఈ అంశంపై అధికారులతో చర్చించానన్న మంత్రి.. పరీక్ష నిర్వాహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి కావచ్చాయని ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని వాయిదా వేయడం కుదరదని తేల్చి చెప్పారు. 

జూన్ 12న టెట్తో పాటు ఆర్ఆర్బీ ఎగ్జామ్ ఉందని వీ6  వెలుగు పత్రికలో  ఇవాళ వార్త ప్రచురితమైంది. ఆ వార్త క్లిప్పింగ్ను టెట్ అభ్యర్థి ఒకరు మంత్రి కేటీఆర్ను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఒకే రోజు రెండు పరీక్షలు ఉన్నందున అభ్యర్థులు ఇబ్బంది పడతారని, అందుకే టెట్ వాయిదా వేయాలని కేటీఆర్ను అభ్యర్థించాడు. ఈ ట్వీట్పై స్పందించిన మంత్రి కేటీఆర్.. దాన్ని సబితా ఇంద్రారెడ్డికి ట్యాగ్ చేసి పరిశీలించాలని కోరారు. దీనిపై స్పందించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఏడాది 3.5లక్షల మంది అభ్యర్థులు టెట్ ఎగ్జామ్కు అటెండ్ అవుతున్నారని, అధికారులు పరీక్ష నిర్వాహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో  ఎగ్జామ్ పోస్ట్ చేయడం కుదరదని సబిత స్పష్టం చేశారు.

 

మరిన్ని వార్తల కోసం..

11 దేశాల్లో మంకీపాక్స్ కేసులు

గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద మరో సంచలనం