11 దేశాల్లో మంకీపాక్స్ కేసులు

11 దేశాల్లో మంకీపాక్స్ కేసులు

మంకీపాక్స్ కేసులు 11 దేశాలకు విస్తరించాయంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. సుమారు 80 కేసులు నమోదైనట్లు తెలిపింది WHO. వైరస్ వ్యాప్తి పై విస్తృతంగా స్టడీ చేస్తున్నట్లు తెలిపింది. కొన్ని దేశాల్లోని జంతు జనాభాలో ఆ వైరస్ ను ఎండమిక్ గా గుర్తించినట్లు తెలిపింది. స్థానిక ప్రజల్లో, టూరిస్టుల్లో ఆ వైరస్ సోకుతున్నట్లు తెలిపింది. మంకీపాక్స్ వ్యాప్తిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తున్నామంది WHO. మరో 50 కేసులు పెండింగ్ లో ఉన్నాయని.. రాబోయే రోజుల్లో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశాలున్నట్లు తెలిపింది. మంకీపాక్స్ ఓ వైరల్ జూనోసిస్ అని..జంతువుల నుంచి మనుషులకు వైరస్ సోకుతుందని తెలిపింది. స్మాల్ పాక్స్ రోగుల్లో కనిపించిన లక్షణాలే కన్పిస్తాయంది WHO.

మరిన్ని వార్తల కోసం :-

నాటో తూర్పుకొస్తే.. మిలటరీ దింపుతం


సౌత్​ కొరియాలో బైడెన్​ టూర్