ఇండియా టుడే సర్వేలో కేసీఆర్ కి 3 శాతం ఓట్లే

ఇండియా టుడే సర్వేలో కేసీఆర్ కి 3 శాతం ఓట్లే

తాజాగా ఇండియా టుడే మరియు కార్వి ఇన్‌సైట్స్ సంయుక్తంగా నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ (MOTN) సర్వేలో కేసీఆర్ కి కేవలం 3 శాతం ఓట్లే వచ్చాయి. ఢిల్లీకి చెందిన పరిశోధన సంస్థ జూలై 15, 2020 నుంచి జూలై 27, 2020 మధ్య ఈ సర్వే నిర్వహించింది. మొత్తం 24 శాతం ఓట్లలో కేసీఆర్ కి కేవలం 3 శాతం ఓట్లే రావడం గమనార్హం.

ఈ సర్వే ప్రకారం… ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మొత్తానికి మొత్తం ఓట్లు అంటే 24 శాతం సాధించగలిగారు. దాంతో ఆయన వరుసగా మూడవసారి ఉత్తమ సీఎంగా నిలిచారు. రాష్ట్రంలో పలు కిడ్నాపులు మరియు హత్యలు జరిగి ఆయన ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినా కూడా ఆయనకు ఎక్కువ సంఖ్యలో మద్దతు పలకడం గమనార్హం.

తాజా సర్వే ప్రకారం.. టాప్ 7లో ఉన్న ముఖ్యమంత్రులలో ఆరుగురు బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలకు చెందినవారున్నారు. ఈ లిస్టులో యోగి ఆదిత్యనాథ్ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (15 శాతం ఓట్లు), ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి (11 శాతం ఓట్లు) వరుసగా రెండు, మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు. గతంలో వరుసగా మూడుసార్లు నంబర్ వన్ సీఎంగా ర్యాంక్ పొందిన మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్) ఈసారి నాలుగో స్థానానికి (9 శాతం ఓట్లతో) పడిపోయింది.

జనవరి 2020లో జరిగిన సర్వేలో కూడా యోగి ఆదిత్యనాథ్ 18 శాతం ఓట్లు సాధించి మొదటిస్థానంలో ఉన్నారు. అప్పుడు అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీని 11 శాతం ఓట్లు సాధించారు.

ఆగస్టు 2019 సర్వేలో కూడా యోగి ఆదిత్యనాథ్ ఇతర ముఖ్యమంత్రుల కంటే ముందున్నారు. 2019 జనవరిలో నిర్వహించిన సర్వేలో టాప్ ర్యాంకు సాధించిన మమతా బెనర్జీని వెనకకు నెట్టి ఆయన మొదటిస్థానంలోకి ఎగబాకారు.

ఈ పోల్ కు సంబంధించి గతంలో ప్రజలను డైరెక్ట్ గా కలిసి ఉత్తమ సీఎం ఎవరని అడిగేవారు. అయితే ఈ సారి కరోనా వల్ల టెలిఫోనిక్ పద్ధతిలో అడిగారు. సర్వే కోసం దేశం మొత్తం మీద 12,021 మందిని ఫోన్ల ద్వారా ఉత్తమ సీఎం ఎవరని ప్రశ్నించారు. అందులో 67 శాతం గ్రామీణ ప్రజలను, 33 శాతం పట్టణ ప్రజలను అడిగారు. ఇందుకోసం 97 పార్లమెంటరీ నియోజకవర్గాలు మరియు 19 రాష్ట్రాల్లోని 194 అసెంబ్లీ నియోజకవర్గాలను సర్వే బృందం ఎంచుకుంది. సర్వే ప్రతినిధులు దేశంలోని ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గర్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఈ సర్వే నిర్వహించారు.

For More News..

సెక్రటేరియట్ చూసి ఏం చేస్తారు? కాంగ్రెస్ నేతలకు హైకోర్టు ప్రశ్న?

యూఏఈలో ఐపీఎల్‌కు ఓకే చెప్పిన కేంద్రం