
హైదరాబాద్: ఓ వైపు కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరైనా సమయంలో ధాన్యం కొనుగోలు చేయకపోతుందని మండిపడ్డారు వైఎస్ షర్మిల అనుచరురాలు ఇందిరా శోభన్. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమయిందని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతన్నల పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. మూడు వారాలు దాటితే గానీ ధాన్యం కాంటా వేయడంలేదని.. తరుగు పేరుతో రైతన్నను నిలువునా మిలర్లు ముంచుతున్నారని చెప్పారు. ప్రతి గింజా అమ్ముడుపోయే వరకు.. కొనుగోలు కేంద్రాలు తెరిచే ఉంచాలని ఇందిరా శోభన్ కోరారు.