బీఆర్ఎస్ ఎక్కడ అని ప్రజలు టార్చ్ పట్టుకొని వెతుకుతుండ్రు: కేసీఆర్

బీఆర్ఎస్ ఎక్కడ అని ప్రజలు టార్చ్ పట్టుకొని వెతుకుతుండ్రు: కేసీఆర్

హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత 10 నుంచి 12 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తుందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ బీఆర్ఎస్  ఇన్ చార్జీలకు ఎర్రవల్లి వ్వవసాయ క్షేత్రంలో ఆయన దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభు త్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, సర్వే లన్నీ బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. దివంగత గోపీనాథ్ జూబ్లీహిల్స్ ప్రజల గుండెల్లో ఉన్నారని, అన్నివర్గాల ప్రజల నాయకుడిగా వరుస విజయాలు సాధించార ని చెప్పారు. రోజు రోజుకూ బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుందని అన్నారు. బీఆర్ఎస్ ఎక్కడ అని ప్రజలు టార్చ్ పట్టుకొని వెతుకుతుండ్రు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ను రౌడీకి ఇచ్చారని, ఆ పార్టీ పోటీలోనే లేదని అన్నారు.

రెండున్నరేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధి కారంలోకి రాబోతోందని కేసీఆర్ అన్నారు. ముఖ్యంగా రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై కోపంగా ఉన్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, ఈ విషయాన్ని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలని సూచించారు. చేసిన సర్వేలు అన్నింటిలోనూ 44 శాతానికి పాల్గొన్నారని చెప్పారు. కేటీఆర్ హరీష్ రావుని జూబ్లీహి ల్స్ నియోజకవర్గం పై సీరియస్ గా ఫోకస్ పెట్టాలని సూచన చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, జీజగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.