కేసీఆర్ థర్డ్ ఫ్రెంట్ ఏర్పాటు చేస్తున్నారు : ఎమ్మెల్యే సీతక్క

కేసీఆర్ థర్డ్ ఫ్రెంట్ ఏర్పాటు చేస్తున్నారు : ఎమ్మెల్యే సీతక్క

సింగరేణి ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్ కుటుంబానికి కార్మికులు గుర్తుకు వస్తారని ములుగు ఎమ్మెల్యే సీతక్క వ్యాఖ్యానించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా జీడీకే 11వ బొగ్గు గనిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రలో సీతక్క పాల్గొ్న్నారు. బొగ్గుగనిని సందర్శించి, కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో ఆమెతో పాటు జిల్లా అధ్యక్షుడు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, కాంగ్రెస్ ఐఎన్టీ యూసీ నాయకులు ఉన్నారు. పేపర్ లీకేజ్ వ్యవహారంపై విచారణ జరపాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని.. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా కేసీఆర్ థర్డ్ ఫ్రెంట్ ఏర్పాటు చేస్తున్నారని సీతక్క ఆరోపించారు. ప్రశ్నించే వారిని ప్రభుత్వం అణిచివేస్తోందని విమర్శించారు. సింగరేణి కార్మిక సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని సీతక్క హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండని ఆమె విజ్ఞప్తి చేశారు.