అట్టడుగు వర్గాల అభివృద్ధిని కేసీఆర్ అడ్డుకుంటున్నారు

అట్టడుగు వర్గాల అభివృద్ధిని కేసీఆర్ అడ్డుకుంటున్నారు

పెద్దపల్లి జిల్లా: అట్టడుగు  వర్గాలు  అభివృద్ధి చెందకుండా  కేసీఆర్ అడ్డుకుంటున్నారన్నారని రిటైర్డు ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఆరోపించారు. ప్రపంచమంతా భారత  రాజ్యాంగాన్ని పొగుడుతుంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్ కు  మాత్రం నచ్చడం లేదన్నారు. పెద్దపల్లి జిల్లా  కేంద్రంలో  రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ‘రాజ్యాంగ రక్షణ - ప్రజల పాత్ర’ అనే అంశంపై జరిగిన  సదస్సులో ఆకునూరి మురళి పాల్గొన్నారు. అట్టడుగు వర్గాల అభివృద్ధి అస్సలు కేసిఆర్ కు ఇష్టం లేదని ఆకునూరి మురళి పేర్కొన్నారు. నేనే ఒక రాజ్యాంగం అనే అహంలో కేసీఆర్ ఉన్నాడని.. బలహీన వర్గాలకు కుట్రపూరితంగా విద్యను దూరం చేశాడన్నారు. అందుకే బహుజనులు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని ఆకునూరి మురళి సూచించారు. 

 

 

ఇవి కూడా చదవండి

నకిలీ స్టికర్లతో తిరిగితే కఠిన చర్యలు

కోవిషీల్డ్ డోసుల మధ్య గ్యాప్ తగ్గింపు

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్