కేంద్రమంత్రి షెకావత్‎తో కేసీఆర్ భేటీ.. చర్చంతా దానిపైనే..

కేంద్రమంత్రి షెకావత్‎తో కేసీఆర్ భేటీ.. చర్చంతా దానిపైనే..

న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్.. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‎తో భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాలపాటు పలు అంశాలపై ఆయనతో చర్చించారు. ఏపీతో జల వివాదాలు, కృష్ణా యాజమాన్య బోర్దు పరిధి తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. కేసీఆర్ తన గత పర్యటనలోనూ ఇదే అంశంపై దాదాపు 2 గంటలపాటు కేంద్ర మంత్రితో సమావేశం అయ్యారు. సీఎం వెంట పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, రాజేందర్ రెడ్డి వెళ్లారు. పాలమూరురంగారెడ్డికి పూర్తిస్థాయి అనుమతులివ్వాలని కేంద్రమంత్రిని సీఎం కోరారు. కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ నోటిఫికేషన్ అభ్యంతరాలపై కూడా కేసీఆర్ చర్చించారు. 

గజేంద్ర సింగ్ షెకావత్‎తో భేటీ తర్వాత కేసీఆర్.. కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‎తో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై గోయల్‎తో చర్చించనున్నారు. కాగా.. రేపు తొమ్మిది రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమావేశం కానున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పలు అంశాలపై చర్చించనున్నారు. ఈ సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‎తో పాటు..  ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్ సీఎంలు పాల్గొననున్నారు. మావోయిస్ట్ ప్రభావిత జిల్లాల్లో మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర హోంశాఖ నుంచి వంద శాతం నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన అంశం కావటంతో... కేంద్రమే పూర్తి ఖర్చు భరించాలని సీఎం కేసీఆర్ అన్నారు.

For More News..

మద్యం మత్తులో దంపతుల గొడవ.. చిన్నారి మృతి

కొట్లాట నాకు, కేసీఆర్‎కు మాత్రమే.. నాయకులతో కాదు

రైతుల భూములు కొట్టేసేందుకు బాల్క సుమన్ కుట్రలు చేస్తున్నడు