గజ్వేల్, వెలుగు : త్వరలో గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందజేయనున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్నియోజకర్గంలో ఆయన పర్యటించారు. ములుగు మండల క్షీరసాగరం గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన 75 పడకల హంస హోమియో మెడికల్‌కాలేజ్ హాస్పిటల్‌ను ప్రారంభించారు. అనంతరం గజ్వేల్ మార్కెట్యార్కెట్యార్డులో కొత్త ఆత్మకమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. స్థానిక క్రిస్టియన్ భవన్లో క్రిస్మస్ గిఫ్టులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హంస మెడికల్‌కాలేజీ హాస్పిటల్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఆయుష్ కు మంచి భవిష్యత్ ఉందని, మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో సంప్రదాయ వైద్యానికి ప్రాధాన్యత పెరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 834 ఆయుష్ డిస్పెన్సరీలు, 5 కాలేజీలు, 4 రీసెర్చ్ హాస్పిటల్స్ ఉన్నాయని, ఇందులో అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. గర్భిణుల ఆరోగ్య దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం వారికి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. అనంతరం వర్గల్లో మాతృవియోగం కలిగిన జడ్పీటీసీ బాలుయాదవ్ను ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆయన వెంట ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జడ్పీ చైర్మన్ రోజాశర్మ, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, జిల్లా లైబ్రరీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ గోపాల్ రావు, గడ ముత్యం రెడ్డి ఉన్నారు.
ప్రజావాణికి హాజరుకాని ఆఫీసర్లకు మెమోలు!
అధికారుల తీరుపై సంగారెడ్డి కలెక్టర్ ఆగ్రహం
సంగారెడ్డి టౌన్, వెలుగు : మండల కేంద్రాలలో అధికారులు సకాలంలో స్పందించకపోవడంతోనే ప్రజలు జిల్లాస్థాయిలో గ్రీవెన్స్ కు వచ్చి ఫిర్యాదు చేస్తుంటారని, అలాంటి సమయంలో వారంలో ఒకరోజు జిల్లా అధికారులు గ్రీవెన్స్ కు హాజరు కాకపోవడమేంటని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు హాజరుకాని 36 మంది జిల్లా అధికారులకు మెమోలు జారీ చేయాల్సిందిగా అడిషనల్కలెక్టర్ ను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి నిర్వహిస్తున్నామని, అధికారులు తమ తీరును వెంటనే మార్చుకొని అర్జీలను పరిశీలించాలన్నారు. అన్ని శాఖల అధికారులు ప్రజావాణిలో తమ శాఖకు వచ్చిన అర్జీలు, పరిష్కరించినవి, పెండింగ్‌లో ఉన్నవాటి వివరాలను రిజిస్టర్లలో అప్డేట్ చేయాలని ఆదేశించారు. సోమవారం వివిధ సమస్యలపై 75 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు రాజార్జి షా, వీరారెడ్డి
పాల్గొన్నారు.
మెదక్‌లో...
మెదక్‌టౌన్, వెలుగు : మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో డీఆర్డీవో శ్రీనివాస్, డీఎస్వో శ్రీనివాస్‌తో కలిసి అడిషనల్కలెక్టర్ రమేశ్ ప్రజల నుంచి 48 అర్జీలను స్వీకరించారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 28, డబుల్ బెడ్ రూమ్‌కు సంబందించి 4, ఉపాధి హామీకి సంబంధించి 6 దరఖాస్తులు రాగా, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమం, పింఛన్లు తదితర అంశాలకు సంబంధించి 10 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు. వీటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మెదక్ ఎస్పీ ఆఫీసులో నిర్వహించిన ప్రజావాణిలో ఎస్పీ రోహిణి ప్రియదర్శిని స్వయంగా బాధితుల సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి కృషి చేయనున్నట్లు బాధితులకు భరోసా కల్పించారు.
సిద్దిపేటలో...
సిద్దిపేట రూరల్, వెలుగు : కలెక్టరేట్ లోని ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, ముజామ్మిల్‌ఖాన్ ప్రజల నుంచి 140 దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజావాణిపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందన్నారు. సమస్యలను వెనువెంటనే పరిష్కరించాలని బాధితులకు న్యాయం చేయాలని చెప్పారు. జిల్లా అధికారులు ఎవ్వరూ గైర్హాజరు కావద్దని సూచించారు.
బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయండి
సిద్దిపేట రూరల్/మెదక్‌టౌన్, వెలుగు : కార్యకర్తలు బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి అరవింద్ మీనన్ పిలుపునిచ్చారు. సోమవారం సిద్దిపేట, మెదక్ పట్టణంలో వేర్వేరుగా నిర్వహించిన జిల్లా పదాధికారుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కదలాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ధరణితో రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ధరణిని వ్యతిరేకిస్తూ ఈనెల 27న అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జోనల్ఇన్చార్జి ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీకి రాష్ట్రంలో ఆదరణ పెరిగిందన్నారు. సిద్దిపేటలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ కార్యకర్తలే బీజేపీకి బలమని, దాంతోనే దుబ్బాక, హుజూరాబాద్, హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీ గెలిచిందని, మునుగోడులో అధికార పార్టీ గెలిచినా అది గెలుపే కాదని అన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఏ క్షణమైనా రావచ్చని, అందుకు కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మెదక్‌లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్ధన్‌రెడ్డి, సింగాయిపల్లి గోపి, మెదక్ జిల్లా ప్రెసిడెంట్ గడ్డం శ్రీనివాస్, జిల్లా ఇన్చార్జి మల్లారెడ్డి, జనరల్ సెక్రటరీలు సుధాకర్‌రెడ్డి, విజయ్ కుమార్, సురేశ్, సిద్దిపేటలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి అంజన్ కుమార్ యాదవ్ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎయిడెడ్ టీచర్లకు వేతనాలు ఇవ్వాలి
యూటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన
సంగారెడ్డి టౌన్, వెలుగు : ఎయిడెడ్ టీచర్లకు వేతనాలు ఇవ్వాలని, టీచర్లకు అన్ని రకాల పెండింగ్ బిల్స్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అశోక్ ప్రధాన కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ రెండు నెలలుగా వేతనాలు రాక ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జడ్పీ జీపీఎఫ్ లోన్స్, పార్ట్ ఫైనల్, ఫైనల్ పేమెంట్ పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసరావు, జ్ఞాన మంజరి, ఏసప్ప, అనురాధ, పాల్గొన్నారు.
కలెక్టర్ ను కలిసిన కొత్త కమిటీ..
యూటీఎఫ్ 5వ రాష్ట్ర మహాసభల అనంతరం ఏర్పడిన కొత్త కమిటీ సోమవారం కలెక్టర్ శరత్ ను కలిసింది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పంపిణీ చేస్తున్న బియ్యాన్ని నేరుగా పాఠశాలలకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, టీచర్ల సర్వీసులు రెగ్యులరైజేషన్ చేయాలని కోరారు. అలాగే జడ్పీ సీఈఓ ఎల్లయ్యకు, డీఈవో వినతిపత్రాన్ని అందజేశారు.