కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలనను బుల్డోజర్లతో తొక్కిస్తాం

కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలనను బుల్డోజర్లతో తొక్కిస్తాం

హైదరాబాద్: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బుల్డోజర్లు తెలంగాణకు వస్తున్నాయని.. కేసీఆర్ కుటుంబ పాలనను బుల్డోజర్లతో తొక్కిస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ అన్నారు. యూపీతోపాటు మిగిలిన రాష్ట్రాల్లోనూ బీజేపీ సత్తా చాటుతుండడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ బుల్డోజర్లు రెడీ అవుతున్నాయని.. తెలంగాణ ప్రభుత్వ అవినీతి, కేసీఆర్ కుటుంబ పాలనను బుల్డోజర్లతో తొక్కించ్చేస్తామన్నారు.  5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తుఫాన్ లా వచ్చాయి.. ఈ గెలుపు బీజేపీదే కాదు.. అక్కడి ప్రజలది.. ప్రజల్లో ఉండి పనిచేసినందుకే పట్టం కట్టారని పేర్కొన్నారు. 
బీజేపీ పట్ల పెరిగిన నమ్మకానికి నిదర్శనం
5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దేశంలో బీజేపీ పట్ల పెరిగిన నమ్మకానికి, ప్రజల్లో ఉన్న ఆదరణకు తాజా నిదర్శనమని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. యూపీలో యోగి మళ్లీ సీఎం కావాలని దేశ వ్యాప్తంగా ప్రజలందరూ కోరుకున్నారని.. అందుకే భారీ మెజారిటీతో రెండోసారి సీఎం పగ్గాలు చేపట్టబోతున్నారని అన్నారు. యూపీలో మాఫియాను ఖతం చేసి.. గూండా రాజ్యాన్ని ఖతం చేసినందుకే జనం మరోసారి పట్టం కట్టారని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు. తప్పు చేసినా.. అవినీతి చేసినా ఎంతటి వారైనా ఉపేక్షించకుండా సీఎం యోగి అందరిపై బుల్ డోజర్ నడిపించారని.. తెలంగాణలో కూడా అదే తరహాలో శ్యాండ్ మాఫియా.. ల్యాండ్ మాఫియాలను బుల్డోజర్లతో తొక్కిస్తామన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు ఖతం అయిపోయాయని రాజాసింగ్ పేర్కొన్నారు. 
తెలంగాణలో హిట్లర్ కేసీఆర్ రూపంలో పుట్టారు
హిట్లర్ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ రూపంలో పుట్టారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. నియంతృత్వానికి నిదర్శనంలా నిలుస్తున్న కేసీఆర్  కు కలలో కూడా మోడీ కనిపిస్తున్నారని, అందుకే బీజేపీ అంటే భయపడుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ అంటే భయంతోనే చిన్న చితక కార్యకర్తలనే కాదు.. ఎమ్మెల్యేలను కూడా విడిచిపెట్టకుండా కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మొదటిసారి సెంటిమెంట్ తో గెలిచిన కేసీఆర్ రెండోసారి మోసం చేసి గెలిచారని, అయితే కేసీఆర్ పెద్ద మోసగాడని జనం గుర్తించారని.. రెండు నాల్కల ధోరణిని గమనించారని రాజాసింగ్ పేర్కొన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణలో బీజేపీ విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 


 

 

 

 

ఇవి కూడా చదవండి

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ అప్‎డేట్స్

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్ అప్‎డేట్స్