భక్తులతో కిటకిటాడిన కేదారీశ్వర ఆశ్రమం

భక్తులతో కిటకిటాడిన కేదారీశ్వర ఆశ్రమం

​నందిపేట, వెలుగు : ప్రసిద్ధ పుణ్యక్ష్రేతం కేదారీశ్వర ఆశ్రమం బుధవారం భక్తులతో కిటకిటలాడింది. ఆశ్రమ వ్యవస్థాపకులు మంగి రాములు మహరాజ్ విజయదశమి రోజున చేపట్టిన దీక్ష బుధవారం తెల్లవారు జామున విరమించారు. దీంతో ఆశ్రమం వద్ద జాతర జరిగింది.  జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు.  అనంతరం అశ్రమానికి వచ్చిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. 

ఇటీవల ఉత్తరప్రదేశ్​ లోని ప్రయాగ్​రాజ్​లో కుంభమేళా సందర్బంగా  41 రోజుల పాటు ప్రతీరోజు ఇడ్లీ సాంబారు తో  ఆశ్రమం తరఫున అల్పాహారం ఏర్పాటు
 చేయడాన్ని గుర్తించిన వండర్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​ ఇంటర్నేషనల్​( లండన్​) వారు మంగళవారం రాత్రి ఆశ్రమానికి చేరుకుని మహరాజ్​ దీక్ష విరమణ అనంతరం ప్రశంసా పత్రాన్ని అందజేశారు.