
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాల తర్వాత దర్శకుడు తరుణ్ భాస్కర్ నుండి వస్తున్న చిత్రం ‘కీడా కోలా’. హీరో రానా దగ్గుబాటి ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. పోస్టర్స్ ద్వారా ఈ చిత్రంలోని ఎనిమిది పాత్రలను పరిచయం చేసిన మేకర్స్, టీజర్‌తోనూ సినిమాపై ఆసక్తిని పెంచారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. నవంబర్ 3న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా వదిలిన రిలీజ్ డేట్ పోస్టర్‌లో బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, చైతన్య రావుతో సహా ఇతర లీడ్ యాక్టర్స్ అంతా సీరియస్ లుక్‌లో కనిపించడం క్యూరియాసిటీని పెంచుతోంది. తరుణ్ భాస్కర్ ఇందులో లోకల్ డాన్‌గా కీలకపాత్ర పోషించాడు. రఘు రామ్, రవీంద్ర విజయ్, జీవన్ కుమార్, విష్ణు, రాగ్ మయూర్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.
ALSO READ: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్‌గా మహేష్