
జక్కన్న చెక్కిన మరో అద్భుతం ఆర్‌ఆర్‌ఆర్ మూవీ. ఈ సినిమాలో ‘నాటునాటు’ పాటకు ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి అన్నారు. ప్రతిష్ఠాత్మక అవార్డు ఇచ్చిన హెచ్‌ఎఫ్‌పీఏకు ధన్యవాదాలు తెలిపారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డు తన సోదరుడు రాజమౌళికి దక్కాలని చెప్పారు. పాటలో భాగమైన రాహుల్ సిప్లిగంజ్‌కు ధన్యవాదాలు తెలిపారు. పాటకు కాళభైవర అద్భుత సహకారం అందిచారన్నారు. తన శ్రమను, తనకు మద్దతు ఇచ్చినవారిని నమ్ముకున్నానని వెల్లడించారు. సంతోష సమయాన్ని తన భార్యతో పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమాకు కీరవాణి అందించిన సంగీతం, బీజీఎం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘నాటు నాటు’ పాట దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరిని ఆకట్టుకుంది.చంద్రబోస్ సాహిత్యానికి కీరవాణి సంగీతం తోడవగా.. రాంచరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు ఈ పాటకు మరింత క్రేజ్‌ను తీసుకొచ్చాయి.