
బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది కీర్తి సురేష్ . లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తో పాటు చిన్న, పెద్ద స్టార్ అని తేడా లేకుండా వరుస సినిమాలను లైన్ లో పెడుతోంది. ప్రస్తుతం మహేష్‌కి జంటగా ‘సర్కారు వారి పాట’, నానితో ‘దసరా’ చిత్రాల్లో నటిస్తోంది కీర్తి. అలాగే ‘భోళాశంకర్’ మూవీలో చిరంజీవికి చెల్లెలిగా కనిపించబోతోంది. వీటితో పాటు పలు తమిళ, మలయాళ సినిమాలు కూడా కీర్తి లిస్టులో ఉన్నాయి. తాజాగా మరో మూవీకి సైన్ చేసినట్టు తెలుస్తోంది. శర్వానంద్‌కి జంటగా నటించేందుకు రెడీ అవుతోందట కీర్తి. ఈ సినిమాకి కృష్ణ చైతన్య దర్శకుడు. ఇందులో హీరోయిన్ మిడిల్ ఏజ్ మదర్ పాత్రలో కనిపించాల్సి ఉంటుందట. దీనికోసం ముందుగా కృతీశెట్టిని సంప్రదించగా ఆమె నో చెప్పిందట. అయితే ఇదే స్టోరీ కీర్తికి వినిపిస్తే కథతో పాటు క్యారెక్టర్ ఇంపార్టెన్స్ నచ్చి వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇక తల్లి పాత్రలో నటించడం కీర్తికి ఇదేమీ కొత్త కాదు. గతంలో ‘పెంగ్విన్’ చిత్రంలోనూ ఈ తరహా పాత్ర పోషించింది. సాధారణంగా ఫామ్ లో ఉన్న హీరోయిన్లు చెల్లి, తల్లి పాత్రల్లో చేసేందుకు అంగీకరించరు. కానీ డిఫరెంట్ సబ్జెక్టుల్లో నటిస్తేనే యాక్టర్‌గా ప్రూవ్ చేసుకోవచ్చని ఫీలవుతోందట కీర్తి!