Keerthi Suresh: తెలుగులో క్రేజీ ప్రాజెక్ట్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన కీర్తి

Keerthi Suresh: తెలుగులో క్రేజీ ప్రాజెక్ట్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన కీర్తి

స్టార్స్ అందరూ కష్టపడేది సక్సెస్ కోసమే. కానీ, కొన్నిసార్లు భారీ విజయాలు కూడా ఇబ్బందిపెడతాయి. తరువాత ఆ స్థాయిలో ఆడియన్స్ ను మెప్పించాలంటే చాలా కష్టం. దానికి పర్ఫెక్ట్ ఎగ్జామ్పుల్ కీర్తి సురేష్(Keerthi Suresh). ఆమె నటించిన మహానటి సినిమా ఎంత గొప్ప విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలనాటి నటి సావిత్రి జీవితకథ ఆధారంగా వచ్చిన ఈ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో జీవించారు. ఈ సినిమా ఆమెకు నటిగా గుర్తింపుతో పాటు.. ఎన్నో అవార్డులను సైతం తెచ్చిపెట్టింది.

అయితే ఈ సినిమా తరువాత ఆమెకు అవకాశాలు భారీగానే వచ్చాయి కానీ, సక్సెస్ మాత్రం వరించలేదు. మహానటి తరువాత ఆమె ఆల్మోస్ట్ అందరు టాప్ హీరోలతో వర్క్ చేశారు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో కూడా కనిపించారు. కానీ, ఆమె నటించిన ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేదు. దాంతో..ఆమెకు ఆమెకు అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం తమిళ తేరి హిందీ రీమేక్ లో నటిస్తున్నారు కీర్తి. వరుణ్ ధావన్ హీరోగా వస్తున్న ఈ సినిమా ఇటీవలే లాంఛనంగా మొదలైంది. 

ఇక తాజాగా సమాచారం ప్రకారం.. మరో తెలుగు నుండి మరో బంపర్ ఆఫర్ కొట్టేశారట కీర్తి సురేష్. అదేంటంటే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. త్వరలో అధికారిక ప్రకటన రానున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ తో సహా మరో భారీ సంస్థ కలిసి నిర్మించనున్నారట. యాక్షన్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా కీర్తి సురేష్ ను ఫిక్స్ చేయనున్నారట మేకర్స్. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ వార్తల్లో నిజమంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.