ఢిల్లీలో చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల సాయం

ఢిల్లీలో చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల సాయం

ఢిల్లీ అల్లర్లలో బాధితులందరినీ ఆదుకుంటామని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. గొడవల్లో చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు అందిస్తామన్నారు.  చనిపోయిన  వారిలో మైనర్లు ఉంటే వారి కుటుంబాలకు 5 లక్షలు,  ఇళ్లు, షాప్ లు అలర్లలో ధ్వంసమై నష్టపోయిన వారందరికీ 5 లక్షల రూపాయలు ప్రకటించారు.  దాడుల్లో తీవ్రంగా గాయపడిన ప్రతి ఒక్కరికీ 5 లక్షల రూపాయలిస్తామన్నారు. దాడుల్లో చాలా మంది రిక్షావాలా పై అటాక్ జరిగింది. రిక్షాలను కూడా ధ్వంసం చేశారు. రిక్షా కోల్పోయిన వారికి 25 వేలు, ఈ రిక్షా కు 50 వేలు, పెంపుడు జంతువులు కోల్పోయిన వారికి ఒక్కో జంతువుకు 5 వేలు ప్రభుత్వం ఇస్తుందని కేజ్రీవాల్ చెప్పారు. ఇళ్లు ధ్వంసమైన వారిలో కిరాయికి ఉన్న వాళ్లు ఉంటే వారికి రూ.లక్ష ఇవ్వనున్నారు. గాయపడిన వారందరికి మెడికల్ బిల్లుల్ని ప్రభుత్వమే కడుతుందన్నారు. బాధితులందరికీ మామూలు  పరిస్థితి నెలకొనే వరకు ఫ్రీ గా ఫుడ్ అందిస్తామని కేజ్రీవాల్ తెలిపారు.

ఎవ్వర్నీ వదలొద్దు: కేజ్రీవాల్

హింసలో ఎవరి ప్రమేయం ఉన్నా కఠినంగా శిక్షించాల్సిందేనని సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఒకవేళ ఆప్ నేతల హస్తం ఉన్నట్లు తేలితే రెండింతల శిక్ష వేయాలని చెప్పారు. గురువారం ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మీడియాతో ఆయన మాట్లాడారు. నేషనల్ సెక్యూరిటీ విషయంలో ఎలాంటి రాజకీయాలు చేయకూడదని అన్నారు. పోలీసులు తన కంట్రోల్​లో ఉండరని, అలాంటప్పుడు తాను ఎలా యాక్షన్ తీసుకోగలనని ప్రశ్నించారు. ఏ వ్యక్తి అయినా.. ఏ మతానికి చెందినవాడైనా నేరం చేస్తే చర్యలు తీసుకోవచ్చని ఆప్ ఎంపీ సంజయ్‌‌ సింగ్‌‌ చెప్పారు. హింస జరుగుతున్న సమయంలో ఇంట్లోకి ఒక గుంపు ప్రవేశించడంపై మీడియాకు, పోలీసులకు తాహిర్‌‌ సమాచారం ఇచ్చారని, పోలీసులు 8 గంటలు ఆలస్యంగా ఎందుకు వచ్చారని ప్రశ్నించారు.