
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా రోగుల కోసం రెండో ప్లాస్మా సెంటర్ అందుబాటులోకి తీసుకువచ్చింది కేజ్రీవాల్ ప్రభుత్వం. ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవ్రాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఇవాళ(మంగళవారం) ఈ ప్లాస్మా సెంటర్ ను ప్రారంభించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తున్న లోక్ నాయక్ హాస్పటల్ లోఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. మొదటి ప్లాస్మా సెంటర్ విజయవంతమైందనీ, అందుకే రెండో సెంటర్‌ను ఎల్‌ఎన్‌జీపీ దగ్గర ఇవాల ప్రారంభించామని తెలిపారు సీఎం కేజ్రీవాల్.