దేశంలోనే తొలిసారి : మేయర్ గా 21 ఏళ్ల కాలేజీ విద్యార్ధిని

దేశంలోనే తొలిసారి  : మేయర్ గా 21 ఏళ్ల కాలేజీ విద్యార్ధిని
మన దేశంలో చిన్న వయస్సులోనే మేయర్ గా ఎన్నికై ఓ యువతి రికార్డ్ సృష్టించింది. ఇటీవల కేరళ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ లెప్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్ )విజయం సాధించింది.  మొత్తం 14 జిల్లా పంచాయతీలకు గాను 11 జిల్లా పంచాయతీలు, 152 బ్లాక్‌ పంచాయతీలకు గాను 108 బ్లాక్‌ పంచాయతీలను ,  941 గ్రామ పంచాయతీల్లో 514 పంచాయతీలను కైవసం చేసుకుంది. 6 మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఐదింటిని, 86 మున్సిపాలిటీల్లో 35 మున్సిపాలిటీలను చేజిక్కించుకుంది. ఈ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ పార్టీ నుంచి కేరళ రాజధాని తిరువనంతపురం ముదువాన్ ముగల్ వార్డ్ కౌన్సిలర్ గా బీఎస్సీ మ్యాథ్స్ స్టూడెంట్ ఆర్యరాజేంద్రన్ విజయం సాధించారు. కౌన్సిలర్ గా విజయం సాధించడంతో అధికార పార్టీ సీపీఎం డిస్ట్రిక్ ప్యానల్ సెక్రటరియేట్ గా నియమించింది. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆర్య రాజేంద్రన్ కు మేయర్ గా పదవి వరించింది. లోకల్ బాడీ ఎన్నికల్లో సీపీఎం విజయం సాధించినా.., మేయర్  పదవి ఎన్నిక ఆ పార్టీకి కత్తిమీద సాములా తయారైంది. పెరూర్కాడ వార్డ్ నుంచి మేయర్ పదవి కోసం సీనియర్ నేత జమీలా శ్రీధరన్ ప్రయత్నించారు. కానీ జమీల శ్రీధరన్ కు వ్యతిరేకత ఏర్పడడంతో..మేయర్ పదవిని పార్టీ యువనేతలకు కట్టబెట్టాలనే డిమాండ్లు తెరపైకి వచ్చాయి. దీంతో పార్టీ అధిష్టానం బీఎస్సీ విద్యార్ధిని ఆర్యా రాజేంద్రన్ కు మేయర్ పదవి కట్టబెట్టింది. ఆర్యా రాజేంద్రన్ తిరువనంతపురంలోని ఎల్బీఎస్ ఇంజినీరింగ్ కాలేజీలో డిగ్రీ చదువుతుంది. దీంతో పాటు పొలిటికల్ గా యాక్టీవ్ గా ఉంది. ఎస్ ఎఫ్ ఐ స్టేట్ కమిటీ మెంబర్ గా, కేరళ సీపీఎం పార్టీ చిల్డ్రన్ వింగ్ విభాగానికి ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో  ఆర్యరాజేంద్రన్ సత్తాచాటారు. జిల్లాలో ఆరు మున్సిపల్ కార్పొరేషన్లకు గాను ఐదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ  విజయం సాధించడంలో కీరోల్ ప్లే చేశారు. దీంతో అధికార పార్టీ  మేయర్ గా ఆర్య రాజేంద్రన్ ఎంపికయ్యారు. పార్టీ నాకు ఎలాంటి బాధ్యతను అప్పగించినా సమర్ధవంతంగా పనిచేస్తాను. చదువుతో పాటు రాజకీయాల్లో కొనసాగుతూ ప్రజాసమస్యలే పరమావధిగా పనిచేస్తానని మీడియా సమావేశంలో తెలిపారు.  త్వరలో జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇప్పటి నుంచే లోయర్ ప్రైమరి స్కూల్స్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని  ఆర్యా రాజేంద్రన్ వెల్లడించారు.