ఉచిత వ్యాక్సిన్ కోసం కేరళ అసెంబ్లీ తీర్మానం

ఉచిత వ్యాక్సిన్ కోసం కేరళ అసెంబ్లీ తీర్మానం

తిరువనంతపురం: కరోనా కష్టాల సమయంలో దేశ ప్రజంలందరికీ ఉచిత సార్వత్రిక వ్యాక్సినేషన్ చేపట్టాలని కోరుతూ కేరళ అసెంబ్లీ ఏకగ్రీంగా తీర్మానం ఆమోదించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి వీణా జార్జ్ తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. దేశంలోనే తయారవుతున్నా చాలా రాష్ట్రాలు వ్యాక్సిన్ కొరతతో ఇబ్బందిపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వమే అందరికీ ఉచితంగా సార్వత్రిక వ్యాక్సినేషన్ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం ఆమోదించారు. 
కరోనా మహమ్మారి అదుపులోకి తీసుకురావడానికి అన్ని రాష్ట్రాలు అష్ట కష్టాలు పడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని వ్యాక్సినేషన్ వేగవంతంగా చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు. అధికార ఎల్డీఎఫ్ ప్రవేశపెట్టిన తీర్మానానికి కొన్ని సవరణలతో కాంగ్రెస్, యూడీఎఫ్ కూటమి సభ్యులు ఆమోదం పలికారు.