తెలంగాణలోకి రిచ్‌‌‌‌‌‌‌‌మ్యాక్స్‌‌‌‌‌‌‌‌ ఫిన్‌‌‌‌‌‌‌‌వెస్ట్ సర్వీస్‌‌‌‌‌‌‌‌లు

తెలంగాణలోకి రిచ్‌‌‌‌‌‌‌‌మ్యాక్స్‌‌‌‌‌‌‌‌  ఫిన్‌‌‌‌‌‌‌‌వెస్ట్ సర్వీస్‌‌‌‌‌‌‌‌లు
  • ఒకే రోజు 10 బ్రాంచులను ఓపెన్ చేయనున్న కంపెనీ 

హైదరాబాద్, వెలుగు: కేరళ బేస్డ్‌‌‌‌‌‌‌‌  రిచ్‌‌‌‌‌‌‌‌మ్యాక్స్ గ్రూప్‌‌‌‌‌‌‌‌కు చెందిన  గోల్డ్‌‌‌‌‌‌‌‌ లోన్‌‌‌‌‌‌‌‌ కంపెనీ ఫిన్‌‌‌‌‌‌‌‌వెస్ట్‌‌‌‌‌‌‌‌  తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ నెల 17 న ఒకే రోజు 10 బ్రాంచులను ఓపెన్ చేస్తామని ప్రకటించింది. మొదటిదశలో 25 బ్రాంచులను, రెండో దశలో 15 బ్రాంచులను ప్రారంభిస్తామని, ఈ ఏడాది చివరిలోపు 100 బ్రాంచులను ఓపెన్ చేస్తామని  పేర్కొంది. 

గోల్డ్‌‌‌‌‌‌‌‌, మైక్రో, హోమ్‌‌‌‌‌‌‌‌ లోన్లను ఇచ్చే ఫిన్‌‌‌‌‌‌‌‌వెస్ట్‌‌‌‌‌‌‌‌  తెలంగాణలో 400 బ్రాంచులను ఓపెన్ చేస్తుందని రిచ్‌‌‌‌‌‌‌‌ మ్యాక్స్ గ్రూప్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ జార్జ్‌‌‌‌‌‌‌‌ జాన్‌‌‌‌‌‌‌‌ వాలెట్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు. తద్వారా 2,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. అంతేకాకుండా రిచ్‌‌‌‌‌‌‌‌మ్యాక్స్ ఫిన్‌‌‌‌‌‌‌‌వెస్ట్‌‌‌‌‌‌‌‌ 2030 నాటికి వెయ్యి బ్రాంచులను ఓపెన్ చేయాలని టార్గెట్ పెట్టుకుందని, 2040 నాటికి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకింగ్ లైసెన్స్ పొందుతుందని ధీమా వ్యక్తం చేశారు.