‘ది కేరళ స్టోరీ’ ఆర్ఎస్ఎస్ కుట్రలో భాగమే.. కేరళ సీఎం సంచలన కామెంట్స్

‘ది కేరళ స్టోరీ’ ఆర్ఎస్ఎస్ కుట్రలో భాగమే.. కేరళ సీఎం సంచలన కామెంట్స్

‘ది కేరళ స్టోరీ’ సినిమాపై కేరళ సీఎం పినరయి విజయన్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ సినిమా ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ కుట్రలో భాగమేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాతో.. ఆర్ఎస్ఎస్ అబద్ధాలను ప్రచారం చేస్తోందని, మత ఉద్రిక్తతలను పెంచేందుకే ఇలాంటి ప్రచారాలను వ్యాప్తి చేస్తోందని మండి పడ్డారు.

ఫేక్ కథనాలు, సినిమాల ద్వారా విభజన రాజకీయాలను వ్యాప్తి చేసేందుకు సంఘ్ పరివార్ ప్రయత్నిస్తోందని, కేరళలో 32,000 మంది మహిళలు ఇస్లాం మతంలోకి చేరి, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థలో చేరారనేది పెద్ద అబద్ధం అని కొట్టి పారేశారు. ప్రస్తుతం పినరయి విజయన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఇక పినరయి విజయన్ తో పాటు.. కేరళ సీపీఎం పార్టీ,  కాంగ్రెస్ పార్టీలు కూడా ఈ సినిమాపై విమర్శలు గుప్పిస్తున్నాయి. రాష్ట్రంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకే ఆర్ఎస్ఎస్ ఇలాంటి సినిమాలను నిర్మిస్తోందని కామెంట్స్ చేస్తున్నాయి. 

ఇక ‘ది కేరళ స్టోరీ’ మూవీని సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. కేరళ రాష్ట్రంలో 32,000 మంది మహిళలు తప్పిపోయిన కథ ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమా మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ కి ముందే సంచలనాలకు కేరాఫ్ గా మారిన ఈ మూవీ.. రిలీజ్ తరువాత ఎలాంటి వివాదాలకు దారితీస్తుందో చూడాలి మరి.