అల్లు అర్జున్ - షారుక్ ఖాన్ మల్టీస్టారర్?.. 'వార్ 2' విడుదల వేళ ఊపందుకున్న ప్రచారం

అల్లు అర్జున్ - షారుక్ ఖాన్ మల్టీస్టారర్?..  'వార్ 2' విడుదల వేళ ఊపందుకున్న ప్రచారం

బాలీవుడ్ లో  స్టార్ హీరో హృతిక్ రోషన్ కు  దక్షిణాదిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్  ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం 'వార్ 2' . ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినీ ప్రియులను ఆనందంలో ముంచే వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ఒకే సినిమాలో కలిసి నటించబోతున్నారని ఇంటర్ నెట్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది.  ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును హోంబాలే ఫిలిమ్స్ సంస్థ నిర్మించబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సంస్థ గతంలో 'KGF' సిరీస్, 'సలార్ ' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తీసి దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకుంది.  ఇప్పుడు ఈ మల్టీస్టారర్ మూవీని కూడా నిర్మించడానికి సిద్ధంగా ఉందని సమాచారం. 

ఈ సినిమాకు  ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించనున్నారని టాక్ వినిపిస్తోంది. 'పఠాన్', 'జవాన్' వంటి సినిమాలతో షారుక్ ఖాన్ తన బాక్సాఫీస్ సత్తా ఏమిటో మరోసారి నిరూపించుకున్నారు. మరోవైపు, 'పుష్ప' సిరీస్‌తో అల్లు అర్జున్ పాన్-ఇండియా స్టార్‌గా మారారు. అతని స్టైల్, నటన కోట్లాది మంది అభిమానులను ఆకట్టుకుంది. వీరిద్దరిలో ఒక సౌత్ ఇండియాలో, మరొకరు బాలీవుడ్ లో తిరుగులేని స్టార్‌డమ్‌ను అనుభవిస్తున్నారు. అలాంటి ఈ ఇద్దరు స్టార్స్ ఒకే తెరపై కనిపిస్తే, అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.

►ALSO READ | Akkineni Nagarjuna: 'శివ' రీ-రిలీజ్: డాల్బీ అట్మాస్‌ సౌండ్‌తో 4Kలో వస్తున్న క్లాసిక్ మూవీ.!

ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రారంభ దశలో ఉందని, ఒక భారీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ వార్తలపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఒక భారీ బడ్జెట్ సినిమాకు సిద్ధమవుతున్నారు. షారుక్ ఖాన్ కూడా తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో బిజీగా ఉన్నారు.

హోంబాలే ఫిలిమ్స్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చే సినిమాలపై అంచనాలు భారీగా ఉంటాయి. ఇప్పుడు అల్లు అర్జున్, షారుక్ ఖాన్ వంటి స్టార్స్‌తో ఈ ప్రాజెక్టు నిజమైతే, అది దేశవ్యాప్తంగా రికార్డులను తిరగరాస్తుంది. ఈ కల నిజమవుతుందా లేదా అనేది వేచి చూడాలి. సినిమా లవర్స్ ఈ మల్టీస్టారర్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.