Akkineni Nagarjuna: 'శివ' రీ-రిలీజ్: డాల్బీ అట్మాస్‌ సౌండ్‌తో 4Kలో వస్తున్న క్లాసిక్ మూవీ.!

Akkineni Nagarjuna: 'శివ' రీ-రిలీజ్: డాల్బీ అట్మాస్‌ సౌండ్‌తో 4Kలో వస్తున్న క్లాసిక్ మూవీ.!

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, అమల జంటగా నటించిన చిత్రం 'శివ'.  అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ ను సృష్టించింది. వాస్తవికమైన యాక్షన్ సన్ని వేశాలతో సినిమా అంటే ఎలా ఉంటుందో  అన్న దానికి నిర్వచనంగా నిలిచింది. ఇండియన్ స్కీన్ మీద అంతకుముందు ఎన్నడూ చూడని విధంగా సంచలనం సృష్టించి.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టింది. 

'శివ' రీరిలీజ్
ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ 50వ వార్సికోత్సవం సందర్భంగా 'శివ' మరోసారి వెండితెరపై సంచలనం సృష్టించడానికి సిద్ధమైంది. ఈ సినిమా విడుదలైన మూడు దశాబ్దాల తర్వాత, అత్యాధునిక సాంకేతికతతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు త్వరలో రానుంది. ఈసారి 'శివ' సౌండ్‌ను ఒరిజినల్ మోనో మిక్స్ నుండి డాల్బీ అట్మాస్‌కు, అత్యంత అధునాతన AI టెక్నాలజీని ఉపయోగించి పూర్తిగా మార్చేశారు.ఈ విషయాన్ని స్వయంగా అక్కినేని నాగార్జన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.  అభిమానుల అంచనాలకు అనుగుణంగా 4Kలో రీరిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు.

 AI సాంకేతికతతో సరికొత్తగా.. 
ఈ రీ-రిలీజ్ ప్రత్యేకత ఏమిటంటే, ఈసారి 'శివ' సినిమా 4K విజువల్స్‌తో పాటు, సరికొత్త Dolby Atmos సౌండ్‌తో రాబోతోంది. సినిమా ఒరిజినల్ మోనో మిక్స్‌ను, AI సాంకేతికత సహాయంతో Dolby Atmosకు మార్చడం ఒక అద్భుతంగా నిలవనుంది. దీనితో ప్రేక్షకులకు సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఒక కొత్త అనుభూతిని ఇస్తాయి. యాక్షన్ సీక్వెన్స్‌లలోని ప్రతి ధ్వని, వెండితెరపై మరింత శక్తివంతంగా వినిపిస్తాయి. అన్నపూర్ణ స్టూడియోస్ 50వ వార్షికోత్సవం సందర్భంగా ఈ రీ-రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

►ALSO READ | 'కాంతార : చాప్టర్ 1' కనకవతి వచ్చేసింది... యువరాణి లుక్ లో రుక్మిణి వసంత్

'శివ' మీకు ఎంత స్పెషల్ లో.. నాకూ అంతే ...
ఈ రీ-రిలీజ్ గురించి హీరో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, 'శివ' మీకు ఎంత స్పెషల్ లో.. నాకూ అంతే స్పెషల్.. 'శివ' 4Kలో ఎప్పుడు అని అభిమానులు అడుగుతున్నారని చెప్పారు. 'శివ' నా సినీ జీవితంలో ఒక మైలురాయి. ఈ సినిమా నాకు ఐకానిక్ హీరో స్టేటస్ ఇచ్చింది. ఇన్నేళ్ల తర్వాత కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉండటం చూసి, దీనిని మళ్లీ విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. దీన్ని ఒక కల్ట్ క్లాసిక్‌గా మార్చిన ప్రేక్షకులకు, అలాగే కొత్త తరానికి ఈ అనుభూతిని పంచాలనుకున్నాం. అందుకే Dolby Atmos సౌండ్‌తో, 4K విజువల్స్‌తో దీన్ని మళ్లీ తీసుకొస్తున్నాం అని  తెలిపారు.

 

ప్రేక్షకులు కొత్త అనుభూతి..
నాగార్జున, నిర్మాతల నమ్మకం వల్లే ఈ సినిమా అంత గొప్ప విజయం సాధించిందని దర్శకుడు రామ్ గోపాల్ అన్నారు. నేటికీ ఈ సినిమాలో ప్రతి సన్నివేశం, ప్రతి పాత్ర ప్రేక్షకుల మదిలో ఉంది. ఈ రీ-రిలీజ్ నాకు చాలా సంతోషాన్నిచ్చింది. ఒరిజినల్ సౌండ్ బాగున్నప్పటికీ, నేటి ప్రమాణాలకు అనుగుణంగా పూర్తిగా మార్చాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. AI సాంకేతికతతో Dolby Atmosకి మార్చడం వల్ల,  'శివ'ని ఇంతకుముందు చూసిన దానికంటే ఇప్పుడు ప్రేక్షకులు కొత్త అనుభూతిని పొందుతారని తెలిపారు..

అయితే రజనీకాంత్ హీరోగా నటించిన 'కూలీ' సినిమాతో పాటు 'శివ' రీ-రిలీజ్ టీజర్‌ను విడుదల చేస్తారు. ఆగస్టు 14న కూలీ సినిమా విడుదల సందర్భంగా ప్రేక్షకులు థియేటర్లలో 'శివ' సినిమా కొత్త సౌండ్ ఎలా ఉండబోతుందో టీజర్ రూపంలో చూడబోతున్నారు. ఈ సారి సరికొత్త టెక్నాలజీతో వస్తున్న ఈ మూవీ మరో బాక్సాఫీస్ బద్దలు కొడుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేశారు.