వ్యాక్సిన్ తీసుకున్నా వదలని కరోనా.. కేరళ సీఎంకు పాజిటివ్

V6 Velugu Posted on Apr 08, 2021

కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది. ముఖ్యమంత్రులు కూడా కరోనా బారిన పడుతున్నారు. నిన్న త్రిపుర ముఖ్యమంత్రి  బిప్లబ్  కుమార్ దేబ్ కరోనా బారిన పడగా.. ఇవాళ  కేరళ సీఎం పినరయి విజయన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. చికిత్స కోసం కోజికోడ్ లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చేరారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేసుకుని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మార్చి 3న విజయన్ కోవిడ్ ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు.

Tagged Vaccine

More News