ఆ ఇళ్లల్లో ట్యాప్ తిప్పితే ఏరులై పారుతున్న లిక్కర్

ఆ ఇళ్లల్లో ట్యాప్ తిప్పితే ఏరులై పారుతున్న లిక్కర్

సాధారణంగా మనం ఇంట్లో ట్యాప్ తిప్పితే నీళ్లొస్తాయి. కానీ వారి ఇళ్లల్లో దారాళంగా మందు పడుతుంది. కేరళ త్రిస్సూర్ జిల్లాలో  సోలమన్ అవెన్యూ ఫ్లాట్ ఉంది. ఇప్పుడా ఆ ప్లాట్  రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిగ్గా మారింది. ఎందుకంటారా..?

సోలమన్ అవెన్యూ ప్లాట్ లో  18కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. సాధారణంగా ఇళ్లల్లో కొళాయి తిప్పితే  నీళ్లు పడతాయి. కానీ ఇళ్లల్లో నీటికి బదులు మందు పడుతోంది. దీంతో ఆ ఫ్లాట్లు పగలు ఇళ్లుగా రాత్రిపూట పబ్బులుగా మారిపోతున్నాయి.

అయితే ఈఫ్లాట్లో వింతఘటనపై సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు ట్యాపుల్లో మద్యం ఎలా వస్తుందా అని ఆరా తీయగా..అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఆరు సంవత్సరాల క్రితం ప్లాట్ సమీపంలో రచన అనే బార్ ఉంది. ఆ బార్ యాజమాన్యం అక్రమంగా 6వేల లీటర్ల మద్యాన్ని నిల్వ ఉంచింది. దీనిపై కేసు నమోదు అవ్వడంతో విచారణ చేపట్టిన కోర్ట్ ..ఎక్సైజ్ సిబ్బంది జోక్యం చేసుకుని బాటిళ్లలోని మద్యాన్ని ఖాళీ చేయించాలని ఆదేశించింది.

కోర్ట్ ఉత్వర్వులతో రంగంలోకి దిగిన ఎక్సైజ్ పోలీసులు..,మున్సిపల్ శాఖ, ఆరోగ్య శాఖ అధికారుల ఆధ్వర్యంలో బార్ ప్రాంగణంలో గొయ్యి తొవ్వి సుమారు 6 గంటల పాటు శ్రమించి బాటిళ్లలో ఉన్న మద్యాన్ని పారబోశారు. అయితే అలా పారబోసిన లిక్కరే  నీటి పైపుల్లో నుంచి సోలమన్ అవెన్యూ ప్లాట్ ట్యాపుల్లోకి చేరిందని ఎక్సైజ్ పోలీసులు చావుకబురు చల్లగా చెప్పారు.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నీటి కొళాయిల్లోకి మద్యం రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.