కేరళ ప్రభుత్వంపై గవర్నర్ ఆరిఫ్ సంచలన వ్యాఖ్యలు

కేరళ ప్రభుత్వంపై గవర్నర్  ఆరిఫ్ సంచలన వ్యాఖ్యలు

కేరళ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర గవర్నర్  ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. SFI, పాపులర్  ఫ్రంట్  ఆఫ్  ఇండియా మధ్య కేరళ ప్రభుత్వం సంబంధాలు కొనసాగిస్తోందని గవర్నర్ ఆరోపించారు. గతంలో ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేంద్ర హోంశాఖ పాపులర్  ఫ్రంట్  ఆఫ్  ఇండియాను నిషేధించింది. 

గత కొంతకాలంగా కేరళ ప్రభుత్వం, గవర్నర్  ఆరిఫ్  మొహమ్మద్  మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా గవర్నర్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. కేరళ ప్రభుత్వం పగలు ఎస్ ఎఫ్ ఐ కోసం పనిచేస్తే.. రాత్రి నిషేధిత పీఎఫ్ ఐ కోసం పని చేస్తోందని ఆరోపించారు. ఎస్ ఎఫ్ ఐ-పీఎఫ్ ఐ మధ్య అనుబంధం కొనసాగుతుందని తెలపడానికి తన వద్ద కొన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. 

ప్రస్తుతం తాను ఖచ్చితమైన పేర్లును చెప్పలేనని..  కానీ కేంద్ర దర్యాప్తు సంస్థల వద్ద దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఉందన్నారు గవర్నర్  ఆరిఫ్.  రాష్ట్రంలోని పలు కీలక అంశాలు, విశ్వవిద్యాలయాల్లో నియామకాలకు సంబంధించి ప్రభుత్వంతో గవర్నర్ కు విభేదాలు కొనసాగుతున్నాయి.