ట్రాఫిక్ జామ్అవుతోందని..టోల్ వసూలు రద్దు

ట్రాఫిక్ జామ్అవుతోందని..టోల్ వసూలు రద్దు
  • పలియక్కర వద్ద 4 వారాల పాటు టోల్ రద్దు చేసిన కేరళ హైకోర్టు

తిరువనంతపురం: కేరళ త్రిస్సూర్ జిల్లాలోని ఎడప్పల్లి–మన్నుతి నేషనల్ హైవే(ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్-544)పై ఉన్న పలియక్కర టోల్ ప్లాజా వద్ద టోల్ వసూలును కేరళ హైకోర్టు నాలుగు వారాల పాటు నిలిపివేసింది. 

ఈ మార్గంలో రోడ్డు పూర్తిగా గుంతలమయం కావడం, ఫుల్ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జస్టిస్ ఎ. ముహమ్మద్ ముస్తాక్, జస్టిస్ హరిశంకర్ వి. మీనన్‌‌‌‌‌‌‌‌లతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం వెల్లడించింది. 

రోడ్డు బాగా లేకపోవడంతో పలియక్కర టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్‌‌‌‌‌‌‌‌ అవుతున్నదని.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు హైకోర్టులో పిటిషన్‌‌‌‌‌‌‌‌లు దాఖలు చేశారు. వీటిని విచారించిన కోర్టు ఈమేరకు తీర్పు వెలువరించింది.