హెల్త్ ఇండెక్స్ ర్యాంకింగ్ లో కేరళ నెంబర్ వన్

హెల్త్ ఇండెక్స్ ర్యాంకింగ్ లో కేరళ నెంబర్ వన్

2019-20 సంవ త్సరానికి సంబంధించి నీతి ఆయోగ్ రాష్ట్రాల హెల్త్ ఇండెక్స్ విడుదల చేసింది. హెల్త్ పారామీటర్స్ విషయంలో పెద్ద రాష్ట్రాల కేటగిరీలో ఓవరాల్ పెర్ఫార్మెన్స్ పరంగా కేరళ నెంబర్ వన్ స్టేట్ గా నిలిచింది. తమిళనాడు సెకండ్ పొజిషన్ లో ఉండగా.. తెలంగాణ మూడు, ఆంధ్ర ప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచాయి. చిన్న రాష్ట్రాల్లో మిజోరం,  త్రిపుర మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. పెద్ద రాష్ట్రాల లిస్టులో ఉత్తర ప్రదేశ్ వరస్ట్ స్టేట్ గా నిలిచింది. యూపీ 19వ స్థానంలో ఉండగా, బీహార్ 18, మధ్యప్రదేశ్ 17వ ప్లేస్ లో నిలిచాయి. ఇంక్రిమెంటల్ పెర్ఫార్మెన్స్ విషయంలో ఉత్తరప్రదేశ్, అస్సాం, తెలంగాణ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.

మరిన్ని వార్తల కోసం...

షెడ్యూల్ ప్రకారమే ఐదు రాష్ట్రాల ఎన్నికలు?

సోమాలియా ప్రధాని సస్పెండ్‌