షెడ్యూల్ ప్రకారమే ఐదు రాష్ట్రాల ఎన్నికలు?

షెడ్యూల్ ప్రకారమే ఐదు రాష్ట్రాల ఎన్నికలు?

ఢిల్లీ : దేశంలో ఒమిక్రాన్ కలకలం సృష్టిస్తోంది. వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నా రోజురోజుకూ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.  ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వాహణపై అనుమానాలు నెలకొన్నాయి. అలహాబాద్ హైకోర్టు సైతం ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకట్రెండు నెలలు వాయిదా వేయాలని ఎలక్షన్ కమిషన్కు సూచించింది. ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్.. కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతో పరిస్థితిని సమీక్షించింది. ఐదు రాష్ట్రాల్లో నమోదవుతున్న కరోనా కేసులు, వ్యాక్సినేషన్ గురించి వివరాలు తెలుసుకుంది. వాటిని పరిశీలించిన అనంతరం షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించినట్లు సమాచారం.

ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం ఉత్తరాఖండ్, గోవాల్లో అర్హులైన 100శాతం జనాభా తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. యూపీలో 85శాతం మందికి ఫస్ట్ డోసు ఇవ్వగా.. మణిపూర్, పంజాబ్ లో టీకా తీసుకున్నవారి సంఖ్య 80శాతం కన్నా తక్కువగా ఉంది. ఈ క్రమంలో ఈసీ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రానికి సూచించింది. మరోవైపు ఎన్నికల సంసిద్ధతను సమీక్షించేందుకు ఎన్నికల కమిషన్ మంగళవారం యూపీలో పర్యటించనుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గోవా అసెంబ్లీ కాలపరిమితి మార్చి 15తో ముగియనుండగా, మణిపూర్ మార్చి 19, ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు మే 14తో పూర్తికానుంది. 

For more news..

చండీఘడ్ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ విజయం

15 నుంచి 18లోపు వయసు వారికి జనవరి 1 నుంచి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్