చండీఘడ్ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ విజయం

చండీఘడ్ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ విజయం

అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ చండీఘడ్ మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించింది.  తొలిసారి మున్సిపల్ ఎలక్షన్స్లో పోటీ చేసిన ఆప్ 35 సీట్లలో 14 తన ఖాతాలో వేసుకుంది. గతంలో 20 సీట్లు గెలుచుకున్న బీజేపీ కేవలం 12 సీట్లతో సరిపెట్టుకుని రెండో స్థానానికి పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లో విజయం సాధించగా.. శిరోమణి అకాలీదల్ మరోసారి ఒక్క సీటుకే పరిమితమైంది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంతో ఆప్ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. 
చండీఘడ్ మున్సిపల్ ఎలక్షన్ ఫలితాలు త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ట్రయిలర్ అని ఆమ్ ఆద్మీ పార్టీ అభివర్ణించింది. పంజాబ్ లో సాధించిన విజయం మార్పునకు సంకేతమని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఆప్ తరఫున విజయం సాధించిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 

For more news..

ఏడేళ్లలో ఒక్క నోటిఫికేషన్ రాలే

జనవరి 1 నుంచి జీఎస్టీలో మార్పులు