సోమాలియా ప్రధాని సస్పెండ్‌

సోమాలియా ప్రధాని సస్పెండ్‌

సోమాలియా ప్రధాన మంత్రి మహమ్మద్‌ హుస్సేన్‌ రోబుల్‌ను సస్పెండ్‌ చేసినట్లు ఆ దేశాధ్యక్షుడు మహమ్మద్‌ అబ్దుల్లాహి మహమ్మద్‌ సోమవారం ప్రకటించారు. ప్రధాన మంత్రిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకు ఈ సస్పెన్షన్‌ కొనసాగుతుందన్నారు.  ఈ దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆయన అధికారాలను నిలిపేయాలని అబ్దుల్లాహి మహమ్మద్‌ నిర్ణయించారని దేశాధ్యక్షుని కార్యాలయం సోమవారం ప్రకటన విడుదల చేసింది. 

ఆదేశ పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణలో గత కొంతకాలంగా ఆలస్యం జరుగుతోంది. దీనిపై ఆదివారం ఇద్దరు నేతలు చర్చలు జరిపారు. అయితే వీరు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. చాలా కాలంగా వాయిదా పడుతున్న ఎన్నికలు నవంబర్‌ 1 నుండి ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికలు డిసెంబర్‌ 24 నాటికి పూర్తి కావాల్సి వుంది. శనివారం నాటికి 275 మంది ప్రతినిధులలో 24 మంది మాత్రమే ఎన్నికయ్యారని ఒక శాసనసభ్యుడు తెలిపారు. ప్రధాని ఎన్నికల ప్రక్రియకు తీవ్రమైన ముప్పును కలిగిస్తున్నారని, తన ఆదేశాలను అతిక్రమిస్తున్నారని ఆదివారం అధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

 

మరిన్ని వార్తల కోసం..

దేశంలోని ప్రధాన ఫార్మా హబ్ లలో హిమాచల్ ఒకటి