ఈనెల 15న తెరుచుకోనున్న శబరిమల

ఈనెల 15న తెరుచుకోనున్న శబరిమల

ఈనెల (నవంబర్) 15 నుంచి రెండు నెలల పాటు శబరిమల ఆలయాన్ని తెరవనున్నట్లు అధికారులు తెలిపారు. ఇవాళ(బుధవారం) చితిర అత్తవిశేష పూజను పురస్కరించుకుని ఆల‌యాన్ని తెరిచారు. పూజ ముగిసిన త‌ర్వాత రాత్రి 9 గంట‌ల‌కు ఆల‌యాన్ని మూసి వేయ‌నున్నారు. అయ్యప్ప భ‌క్తుల‌కు వ‌ర్చువ‌ల్ క్యూ బుకింగ్ వ్యవ‌స్థ ద్వారా అనుమ‌తి క‌ల్పిస్తున్నారు. దైవ ద‌ర్శనం కోసం వ‌చ్చేవారు క‌చ్చితంగా వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికేట్‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో వ్యాక్సినేట్ అయి ఉండాలన్నారు. లేదంటే 72 గంట‌ల లోపు తీసిన ఆర్టీపీసీఆర్ రిపోర్ట్‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుందన్నారు.