గూగుల్లో తప్పులు చెప్పాడు.. కోటి రూపాయలు గెలిచాడు

గూగుల్లో తప్పులు చెప్పాడు.. కోటి రూపాయలు గెలిచాడు

మనకు ఏ  సమాచారం కావాలన్నా గూగుల్ ను ఆశ్రయిస్తాం.. ఎందుకంటే గూగుల్ ఎటువంటి సమాచారం అయిన క్షణాల్లో మనకు అందిస్తుంది. గూగుల్ వచ్చాక  ప్రతి ఒక్కరికి సెర్చింగ్ చాలా సులభతరం అయింది. అయితే అలాంటి గూగుల్ లో కూడా సెక్యూరిటీ లోపాలు ఉన్నాయి. అటువంటి కొన్నిసెక్యూరిటీ లోపాలను కనిపెట్టి కంపెనీ నుంచి భారీ నజరానా పొందాడు ఓ  కేరళీయుడు. వివరాల్లోకి వెళితే.. 

కేరళలోని తిరువనంతపురం జిల్లా నెడుమంగడకు చెందిన ఓ పారిశ్రామిక వేత్త శ్రీరామ్ .. టెక్ దిగ్గజం గూగుల్ నుంచి రూ. 1.11 కోట్ల భారీ బహుమతిని అందుకున్నారు. గూగుల్  సేవలలలో లోపాలను ప్రచారం చేసే వల్నరబిలిటీ రివార్డ్ ప్రోగ్రామ్2022లో కేఎల్ శ్రీరామ్ రెండు, మూడు, నాల్గవ స్థానాలను గెలుచుకన్నారు. శ్రీరామ్ గూగుల్ భద్రతా లోపాలను కనుగొన్నట్లు కంపెనీ తెలిపింది. దీనికి గాను  1,35,979 డాలర్లు బహుమతిగా పొందారు. 

శ్రీరామ్ స్క్వాడ్రన్ ల్యాబ్స్ అనే స్టార్టప్ కంపెనీని నడుపుతున్నాడు. కెనడాలో రిజిస్టర్ అయిన శ్రీరామ్ కంపెనీ స్క్వాడ్రన్ ల్యాబ్స్ సైబర్ దాడుల నుంచి ఎన్నో కంపెనీలను కాపాడుతోంది. గూగుల్ , ఇతర సేవలలో భద్రతా లోపాలను గుర్తించి ఇంతకు ముందు కూడా వార్తల్లో నిలిచాడు. శ్రీరామ్ అతని స్నేహితుడు చెన్నైకి చెందిన శివనేష్ అశోక్ నాలుగు రిపోర్టులు పంపగా.. వీటిలో మూడు బహుమతులు గెలుచుకున్నాయి