ఏపీ నకిలీ మద్యం కేసులో కీలక ఏ1 నిందితుడు జనార్ధన్ రావు అరెస్ట్

ఏపీ నకిలీ మద్యం కేసులో కీలక ఏ1 నిందితుడు జనార్ధన్ రావు అరెస్ట్

అమరావతి: ఏపీలో సంచలనం సృష్టిస్తోన్న ములకలచెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ1 నిందితుడు, టీడీపీ నేత జనార్ధన్ రావు అరెస్టు అయ్యారు. సౌత్ ఆఫ్రికా నుంచి విజయవాడకు వచ్చిన జనార్ధన్ రావును శుక్రవారం (అక్టోబర్ 10) గన్నవరం ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ అధికారులు.

ఆయనను శనివారం (అక్టోబర్ 11) కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసును ప్రభుత్వం సీరియస్‎గా తీసుకోవడంతో పోలీసులు జనార్ధన్ రావును కస్టడీకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటికే సోదరుడు జగన్ మోహన్ రావు, జనార్ధన్ రావు అనుచరుడు కట్టా రాజును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 

►ALSO READ | ఏపీ లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి బిగ్ రిలీఫ్..

మరోవైపు.. ములకల చెరువు ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ములకలచెరువు ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని.. ప్రజల ప్రాణాలకు చేటు చేసే నకిలీ మద్యంపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిందితులు ఎంతటి వారైనా వదలొద్దని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.