రాఖీభాయ్ ‘తూఫాన్’ షురూ

రాఖీభాయ్ ‘తూఫాన్’ షురూ

బెంగళూరు: ఇండియన్ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో కేజీఎఫ్ 2 ఒకటి. మొదటి పార్ట్ అనూహ్య విజయాన్ని అందుకోవడంతో శాండల్ వుడ్ తోపాటు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లోనూ ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. దీంతో పెరిగిన అంచనాలను అందుకునే క్రమంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరింత జాగ్రత్త తీసుకుంటున్నాడు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఏప్రిల్ 14న విడుదల ఖాయమైంది. రిలీజ్ దగ్గర పడుతుండటంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ ను పెంచారు. ఇందులో భాగంగానే తాజాగా ‘తుఫాన్’ అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. తమలో ధైర్యాన్ని నింపిన రాఖీ భాయ్ ను పొగుడుతూ గోల్డ్ మైన్ లోని కార్మికులు పాడుతున్న ఈ సాంగ్ లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. 

మరిన్ని వార్తల కోసం:

పగలు మెక్డొనాల్డ్స్ జాబ్.. రాత్రి రన్నింగ్ ప్రాక్టీస్

జూనియర్ ఎన్టీఆర్ కారుకు బ్లాక్ ఫిలిం తొలగింపు