
లండన్ లో ఖలిస్థాన్ మద్దతుదారులు .. బ్రిటీష్ ఇండియన్స్ పై దాడి చేశారు. మార్చి 9న శనివారం లండన్ లోని భారత హైకమిషన్ ఆఫీస్ ముందు రెండు వర్గాలు ఆందోళన చేస్తున్న టైమ్ లో ఈ దాడి జరిగింది. ఇండియాలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బ్రిటీష్ ఇండియన్స్ ప్రదర్శన చేశారు. భారత్ లో మైనారిటీలకు రక్షణ లేకుండా పోయిందంటూ పాకిస్థాన్ కు మద్దతుగా ఆదేశ గూఢచార సంస్థ ఎఎస్ఐ మద్దతుతో ఖలిస్తానీ సపోర్టర్స్ నిరసన తెలిపారు. ఈ సమయంలో ఖలిస్థాన్ మద్దతుదారులు రెచ్చిపోయారు. భారతీయులను పరుగెత్తించి కొట్టారు. సిక్కు టర్బన్ ధరించి వచ్చిన నిరసనకారులు… అల్లా హో అక్బర్ అనే నినాదాలతో ప్రవాస భారతీయులపై దాడి చేశారు. పోలీసులు కలగజేసుకుని కొందరిని అదుపులోకి తీసుకున్నారు.
#WATCH Pakistan’s ISI backed Khalistanis attacked a number of British Indians who were standing outside the Indian High Commission in London on March 9. The men wearing Sikh turbans raised slogans 'Naraa-e-Taqbeer' & 'Allah-u-Akbar' pic.twitter.com/7L5Fume7nv
— ANI (@ANI) March 10, 2019