
కూసుమంచి,వెలుగు: లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలుశిక్ష, రూ. 2 లక్షల జరిమానా విధిస్తూ ఖమ్మం జిల్లా పోక్సోకోర్టు జడ్జి ఉమాదేవి గురువారం తీర్పు ఇచ్చారు. ఖమ్మం రూరల్ఏసీపీ తిరుపతిరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని కూసుమంచి మండలం ధర్మా తండాకు చెందిన బానోతు రాములు(50), 2023 ఆగస్టులో ఇంటి బయట ఆడుకుంటున్న నాలుగేండ్ల బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కూసుమంచి పోలీసులు నిందితుడు రాములుపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు. అనంతరం ఎంక్వైరీ రిపోర్ట్ ను కోర్టులో దాఖలు చేశారు. వాదోపవాదాల అనంతరం నిందితుడు రాములుకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించారు. నిందితుడికి శిక్షపడేలా వ్యవహరించిన పోలీసులను ఖమ్మం సీపీ సునీల్‌దత్ అభినందించారు.