సీతారామ భూ సేకరణ పూర్తి చేయాలి : అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస రెడ్డి

సీతారామ భూ సేకరణ పూర్తి చేయాలి : అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస రెడ్డి
  • ఖమ్మం అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస రెడ్డి

ఖమ్మం టౌన్, వెలుగు :  సీతారామ డీస్ట్రిబ్యూటరీ కెనాల్ భూ సేకరణ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తెలిపారు.  కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్​లో బుధవారం సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులకు భూసేకరణపై, కల్లూరు డివిజన్ సబ్ కలెక్టర్  అజయ్ యాదవ్ తో సమీక్షించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ సీతారామ కింద  రైతులకు సాగునీరు అందించేందుకు అవసరమైన డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని తెలిపారు.

సీతారామ ప్యాకేజీ 2 సంబంధించి 12ఎల్-ఆర్ఎం1 మైనర్ కాల్వ ద్వారా కల్లూరు, పెనుబల్లి మండలాల్లో 12 వేల 454 ఎకరాల ఆయకట్టు సాగునీరు అందుతుందని, దీనికి సంబంధించి అవసరమైన భూముల సేకరణ కోసం పెనుబల్లి మండలంలో ఎస్​డీఆర్​  ప్రక్రియ ఈ ఏడాది ఫిబ్రవరి 3  నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.  కల్లూరు మండలంలో ఎంజాయ్ మెంట్ సర్వే ప్రక్రియ త్వరగా పూర్తి చేసి నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు.

45 రోజుల గ్రామ సభ నిర్వహించి అవార్డు జారీ, తదుపరి చర్యలు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలనిసూచించారు.  ఈ సమావేశంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు శ్రీనివాసులు, సర్వేయర్లు, సంబంధిత మండల తహసీల్దార్లు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.