ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి : వీపీ గౌతమ్

ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి : వీపీ గౌతమ్

ఖమ్మం టౌన్, వెలుగు :  కంట్రోల్ రూమ్ కి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి పరిష్కరించాలని ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులకు సూచించారు. గురువారం న్యూ కలెక్టరేట్ లో ఎన్నికల కంట్రోల్ రూమ్ ను సీపీ సునీల్ దత్ తో కలిసి ఆయన తనిఖీ చేశారు. కంట్రోల్ రూమ్ కు వచ్చే ఫిర్యాదులు, చేపడుతున్న చర్యలను పరిశీలించారు. సీ విజిల్ యాప్, 1950 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వస్తున్న ఫిర్యాదులు, పరిష్కార వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు సీ విజిల్ యాప్ ద్వారా 30 ఫిర్యాదులు రాగా, పరిష్కరించినట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు. 1950 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా 40 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. వచ్చిన ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారి ద్వారా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ చెప్పారు. 
 

పోలింగ్​ కేంద్రాల తనిఖీ 
 

కల్లూరు : కల్లూరు మండల పరిధిలో ని హనుమా తండా, కలాలివాడ, పేరువంచ, ముగ్గు వెంకటాపురంలోని స్కూళ్లలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్, సీపీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, టాయిలెట్ తదితర అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కాంపౌండ్ వాల్ లేని పోలింగ్ కేంద్రాలకు వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. అనంతరం కల్లూరు ఎన్ఎస్పీ తిరువూరు క్రాస్ రోడ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్​పోస్టును తనిఖీ చేసి పలు సూచనలు చేశారు.