గేదెను ఢీకొట్టిన బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇద్దరు మృతి..ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ప్రమాదం

గేదెను ఢీకొట్టిన బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇద్దరు మృతి..ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ప్రమాదం

పెనుబల్లి, వెలుగు : బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేదెను ఢీకొని కిందపడడంతో ఇద్దరు యువకులు చనిపోగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లింగగూడెం గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లింగగూడెం గ్రామానికి చెందిన పద్దం విష్ణు (19), విరప గోపరాజు ఇద్దరూ కలిసి బుధవారం రాత్రి బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వీఎం బంజరుకు వెళ్లారు. అక్కడి బస్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వేచి ఉన్న తమ స్నేహితుడు ములకలపల్లి మండలం కమలాపురం గ్రామానికి చెందిన మిడియం శివ (19)ను బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎక్కించుకొని రాత్రి లింగగూడెం గ్రామానికి వస్తున్నారు. గ్రామ శివారులోకి రాగానే ఓ గేదె సడన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రోడ్డు మీదికి రావడంతో బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేదెను బలంగా ఢీ కొట్టింది. బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అదుపుతప్పి కిందపడడంతో విష్ణు అక్కడికక్కడే చనిపోగా మిగతా ఇద్దరికీ గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు గాయపడిన శివ, గోపరాజును హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకుంటూ శివ చనిపోగా, గోపరాజు చికిత్స తీసుకుంటున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు వీఎం బంజరు ఎస్సై వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు.