తహశీల్దార్ కార్యాలయంలో శిశువు డెడ్ బాడీ కలకలం

తహశీల్దార్ కార్యాలయంలో శిశువు డెడ్ బాడీ కలకలం

ఖమ్మం అర్బన్ తహశీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో ఒక శిశువు మృతదేహం కలకలం రేపింది. తహశీల్దార్ కార్యాలయం పక్కనే బాలికల హాస్టల్ ఉంది. అయితే.. హాస్టల్ నుంచే శిశువు డెడ్ బాడీని పడేసి ఉంటారని అందరూ అనుమానిస్తున్నారు.

తహశీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో కనిపించిన మృత శిశువు వయస్సు ఆరు నెలలు ఉండొచ్చంటున్నారు. ఈ విషయం బయటపడడంతో పోలీసులు, రెవెన్యూ, ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. గర్భం దాల్చిన 5, 6 నెలల తర్వాత అమ్మాయికి అబార్షన్ జరిగి ఉండవచ్చనే ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.