
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, ఆపిల్ బ్యూటీ సమంత నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా ఖుషీ మూవీ గురించి మేజర్ అప్డేట్ వచ్చింది. త్వరలో ఖుషీ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. అంతేకాదు..ట్రైలర్ రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ ప్రకటించారు.
‘ఖుషి’ట్రైలర్ ఆగస్ట్ 9న విడుదల కానుంది. ఈ మేరకు సమంత, విజయ్ దేవరకొండతో పాటు..సినిమా యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ట్రైలర్ 2 నిమిషాల 41 సెకండ్లు ఉంటుందని ప్రకటించారు. ట్రైలర్ అప్టేట్ గురించి అనౌన్స్‌మెంట్ చేస్తూ..విజయ్, సమంత కలిసున్న ఒక క్యూట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ఖుషీ మూవికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.