Game Changer: హ్యాపీ బర్త్‌డే కియారా..అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ గేమ్ ఛేంజర్ టీమ్ విషెస్

Game Changer: హ్యాపీ బర్త్‌డే కియారా..అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ గేమ్ ఛేంజర్ టీమ్ విషెస్

సౌత్​..నార్త్ అనే తేడా లేకుండా కియారా అద్వానీ(Kiara Advani)ఆఫర్లు పట్టేస్తోంది. ప్రస్తుతం శంకర్​ దర్శకత్వంలో ‘గేమ్​ఛేంజర్’ (Game Changer)​ సినిమాలో కియారా నటిస్తోంది. ‘వినయ విధేయ రామ’ తర్వాత రాంచరణ్​తో ఈ బ్యూటీకిది రెండో సినిమా. ఒక్కో సినిమాకు ఈ హీరోయిన్​ 3 నుంచి 4 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుందనే టాక్​ నడుస్తోంది.

తాజాగా గేమ్ ఛేంజర్ మూవీ నుంచి కియారా అద్వానీ బర్త్ డే సందర్భంగా ఓ స్టన్నింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. బుధవారం (జులై 31) తన 33వ బర్త్ డే జరుపుకొంటోంది. 'మా జాబిలమ్మ అలియాస్ కియరాకు జన్మదిన శుభాకాంక్షలు'..శక్తివంతమైన శక్తి త్వరలో మీ హృదయాలను మంత్రముగ్ధులను చేస్తుందంటూ టీమ్ ట్వీట్ చేసింది.

ALSO READ | Bhagyashri Borse: తెలుగు మూవీకి డబ్బింగ్ చెప్పిన పూణె బ్యూటీ..

ఈ పోస్టర్లో కియారా ఓ మల్టీ కలర్ లెహంగాలో బ్యూటిఫుల్గా కనిపిస్తోంది. ఈ తాజా లుక్ జరగండి జరగండి పాటలోనిది. కాగా..ఈ బ్యూటీ ధోనీ బయోపిక్ ఎమ్మెస్ ధోనీ : ది అన్‌టోల్డ్ స్టోరీ మూవీలో కనిపించింది. 2018లో వచ్చిన నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ లస్ట్ స్టోరీస్ ద్వారా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అదే ఏడాది ఆమె తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చి మంచి ఫామ్ లో ఉంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ ఒక్కో సినిమాకు ఈ హీరోయిన్​ 3 నుంచి 4 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుందనే టాక్​ నడుస్తోంది. అంతేకాకుండా కియారా ఏడాదికి కనీసం నాలుగైదు సినిమాలు తగ్గకుండా చూసుకుంటోందట.ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాని కియారా మ్యారేజ్ చేసుకుంది.